వయసు 25ఏళ్లు.. చేసిన మోసం రూ. 50 కోట్లు

24 Oct, 2020 11:21 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఇరవై ఐదేళ్ల సీఏ విద్యార్థిని వడోదరలో జీఎస్‌టీ అధికారులు అరెస్ట్‌ చేశారు. టాక్స్‌ ఎగ్గొట్టడానికి ఫేక్‌ కంపెనీలను సృష్టించి 50.2 కోట్ల రూపాయల మేరకు తప్పుదారి పట్టించాడు. దీంతో అధికారులు అతనిని అరెస్ట్‌ చేశారు. గుజరాత్‌లోని వడోదరాకు చెందిన మనీష్‌ కుమార్‌ ఖత్రీ 115 షల్‌ కంపెనీలు సృష్టించి, వివిధ రూపాలలో పన్ను ఎగ్గొట్టాడు. అనుమానాస్పద టాక్స్‌ పేయర్స్‌ను వెలికితీసే ప్రయత్నంలో ఖత్రీ వ్యవహారం రాష్ట్ర‌ జీఎస్‌టీ అధికారుల దృష్టికి వచ్చింది.

ఖత్రీ నకిలీ ఇన్‌వాయిస్‌లు సృ‍ష్టించి టాక్స్‌ కట్టాల్సిన డబ్బును వివిధ  కంపెనీలకు తరలించి 50 కోట్ల రూపాయలకు పైగా మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. దాహుద్‌ అనే చిన్న గ్రామంలో ఉన్న అమాయకుల నుంచి వారి బ్యాంక్‌ ఖాతా వివరాలు తెలుసుకొని వారి పేరు మీద ఈ కంపెనీలు సృష్టించినట్లు అధికారులు కనుగొన్నారు. వారికి నెలకు కొంత మొత్తం చెల్లిస్తానని ఖత్రీ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని కంపెనీలు పన్నులు ఎగ్గొట్టేందుకు సహకారం అందించేందుకుఫేక్‌ వెబ్‌సైట్‌తో నకిలీ‌ కంపెనీలు సృష్టించినట్లు  ఖత్రీ అంగీకరించాడు. చదవండి: గుజరాత్‌లో విషాదం: ముగ్గురు మృతి

మరిన్ని వార్తలు