దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

23 Aug, 2021 11:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా  25,072 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 389 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్‌ బారినపడి మొత్తం 4,34,756 మంది ప్రాణాలు కోల్పోయారు.  అంతేకాకుండా గత 24 గంటల్లో 44,157 మంది కోవిడ్‌ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.

ఇక దేశంలో ఇప్పటివరకు మొత్తం 3,16,80,626 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 3,33,924 కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,24,49,306 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇక దేశంలో మొత్తం 57.6 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 97.57శాతంగా ఉంది. కాగా దేశంలో ఇప్పటి వరకు 50,75,51,399 మందికి కోరోనా పరిక్షలు నిర్వహించినట్లు  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

మరిన్ని వార్తలు