దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

24 Aug, 2021 10:45 IST|Sakshi
త్రిస్సూర్‌లోని 'పులిక్కలి' కళాకారుల టీకా శిబిరంలోని చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా  25,647 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో  354 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్‌ బారినపడి మొత్తం 4,35,110 మంది ప్రాణాలు కోల్పోయారు.  అంతేకాకుండా గత 24 గంటల్లో  39,486 మంది కోవిడ్‌ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.

చదవండి: ఆస్తులు లాగేసుకుని బయటకు గెంటేశారు


ఇక దేశంలో ఇప్పటివరకు మొత్తం 3,17,20,112 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 3,19,551 కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,24,74,773 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇక దేశంలో మొత్తం 58,89,97,805 మంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 97.68 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

చదవండి: మహిళలతో చనువుగా ఫోన్‌ చేయించి అర్ధనగ్న ఫొటోలు..

మరిన్ని వార్తలు