వాళ్ల‌ని రానివ్వండి.. బెంగాల్‌కు కేంద్రం విఙ్ఞ‌ప్తి

10 Aug, 2020 09:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కోల్‌క‌తా: లాక్‌డౌన్ కార‌ణంగా పొరుగున  బంగ్లాదేశ్‌లో చిక్క‌కుపోయిన 2680 మంది భారతీయుల‌ను తిరిగి ప‌శ్చిమ బెంగాల్ రాష్ర్టంలోకి అనుమ‌తించాల్సిందిగా కేంద్రం మ‌రోసారి కోరింది. ఈ మేర‌కు విదేశీ వ్య‌వ‌హారాల శాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శి విక్రమ్ డోరైస్వామి, బెంగాల్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాజీవా సిన్హాకు లేఖ రాశారు. మార్చిలో భార‌త్‌లో లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి వారు బంగ్లాదేశ్‌లోనే చిక్కుకుపోయార‌ని, స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో వారిని అనుమ‌తించాల్సిందిగా పేర్కొంది 'పెట్రోపోల్-బెనాపోల్ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ ద్వారా 2,399 మంది, ఫుల్బరి-బంగ్లాబంధ స‌రిహ‌ద్దులో 281 మంది పౌరులు బెంగాల్‌కు రావాల‌ని కోరుకుంటున్నారు. వారిలో చాలామంది కార్మికులు ఉన్నారు. బంగ్లాదేశ్‌లోని వారి బంధువులను క‌లుసుకోవ‌డానికి పొరుగు దేశానికి వెళ్లారు. అక్క‌డ  చిక్కుకుపోయి చాలా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. వారిపై ద‌య చూపండంటూ' లేఖ‌లో పేర్కొన్నారు. (‘పసలేని ప్రకటన’)

కేంద్రం చేసిన ఈ అభ్య‌ర్థన‌పై బెంగాల్ ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించింది. వారిని రాష్ర్టంలోకి అనుమ‌తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాజీవా సిన్హా అన్నారు. అదే స‌మ‌యంలో బంగ్లాదేశ్‌లో చిక్క‌కుపోయిన వారిని తిరిగి తీసుకురావ‌డానికి కేంద్రం ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డపాల్సిందిగా కోరారు. ఈ మేర‌కు రైల్వే మంత్రిత్వ శాఖ‌కు లేఖ రాశారు. రైలు ఎక్కేముందే అక్క‌డి ప్ర‌జ‌ల‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సిందిగా కోరారు. (దీదీ కీలక వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు