అవయవ దానంలో భారత్‌కు మూడో స్థానం

27 Nov, 2021 18:50 IST|Sakshi

న్యూఢిల్లీ:  గ్లోబల్ అబ్జర్వేటరీ ఆన్ డొనేషన్ అండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (GODT)ప్రకారం, అవయవదానంలో భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉందంటూ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు 12వ భారతీయ అవయవదాన దినోత్సవాన్ని ఉద్దేశించి ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ... " "జీతే జీ రక్తదాన్, మర్నే కే బాద్ అంగదాన్(ప్రత్యక్ష రక్తదానం, మరణానంతరం అవయవ దానం)" అనేది మన జీవితానికి నినాదంగా ఉండాలి. అంతేకాదు మన సంస్కృతి "శుభ్", "లాభ్" లకు మాత్రమే ప్రాధాన్యతనిస్తుంది.

(చదవండి: కృత్రిమ మొసలి అనుకుని సెల్ఫీకి యత్నం... ఇక అంతే చివరికి)

పైగా ఇక్కడ వ్యక్తిగత శ్రేయస్సు అనేది సమాజ శ్రేయస్సుతో మిళతమవుతోంది. అయితే 2010 నుంచి చనిపోయిన దాతలు, వారి కుటుంబాలు సమాజానికి చేసిన సేవలను స్మరించుకోవాడానికే ప్రతి ఏడాది భారతీయ అవయవదాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంతేకాదు 2012-13తో పోలిస్తే అవయవదానం రేటు నాలుగు రెట్లు పెరిగింది.

ఈ మేరకు దేశంలో సంవత్సరానికి జరిగే అవయవ మార్పిడిల సంఖ్య 2013లో 4990 ఉండగా 2019కి వచ్చేటప్పటికీ ఆ సంఖ్య 12746కి పెరిగింది. అయితే భారత్‌ ఇప్పుడు యూఎస్‌ఏ, చైనా తర్వాత స్థానాన్ని ఆక్రమించుకుని ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. ఈ క్రమంలో ప్రజలు తమ అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేయడమే కాకుండా, దేశంలో మార్పిడికి అందుబాటులో ఉన్న అవయవాల కొరతపై ప్రచారం చేసి, ఇతరులు కూడా అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చేలా చేయాలి" అని ఆరోగ్య మంత్రి మాండవియా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

(చదవండి: ఏడాదిగా షాప్‌కి వస్తున్న ప్రమాదకరమైన పక్షి!)

మరిన్ని వార్తలు