సొంత‌పార్టీ నుంచే వ్య‌తిరేక‌త‌..ముగ్గురు నేత‌ల రాజీనామా

26 Oct, 2020 20:46 IST|Sakshi

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ పీపుల్స్ డెమోక్రటక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.త్రివ‌ర్ణ ప‌తాకంపై ఆమె చేసిన వ్యాఖ్య‌లు దేశ‌భక్తి మ‌నోభావాల‌ను దెబ్బ‌తీయంటూ సొంత పార్టీ నేత‌లే విమ‌ర్శించారు. ముఫ్తీ అనుచిత వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా పార్టీని వీడుతున్న‌ట్లు పీడీపీ నేత‌లు  త్రిలోక్ సింగ్ బజ్వా, పుర్బ లెసిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్యే వేద్ మహాజన్, గుజ్జర్ నేత చౌదరి మహమ్మద్ హుస్సేన్ రాజీనామా చేశారు. ముఫ్తీ వ్యాఖ్య‌లు క్ష‌మించ‌రానివ‌ని వ్యాఖ్యానిస్తూ ఇలాంటి చ‌ర్య‌లు ఎంత‌మాత్రం ఆమోద‌యోగ్యం కావ‌ని లేఖ‌లో పేర్కొన్నారు. ఇక గ‌తేడాది ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు నేప‌థ్యంలో మెహబూబా ముఫ్తీ  స‌హా ప‌లువురు రాజ‌కీయ నాయ‌కుల‌ను ప్ర‌భుత్వం అదుపులోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. (గుప్కార్‌ అధ్యక్షుడిగా ఫరూక్‌ అబ్దుల్లా ఎన్నిక )

కాగా  14 నెలల నిర్బంధం తర్వాత శుక్ర‌వారం జైలు నుంచి విడుద‌లైన ఆమె తొలిసారిగా మీడియాతో మాట్లాడుతూ..జమ్మూకశ్మీర్‌లో ప్రత్యేక జెండాను ఎగురవేసేందుకు అనుమతించినప్పుడే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తామని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ నాయ‌కుల‌ను దొంగ‌లు అని అభివ‌ర్ణిస్తూ జమ్మూకశ్మీర్‌లో ప్రత్యేక జెండాను తిరిగి పున‌రుద్ధ‌రించాల‌ని డిమాండ్ చేశారు. ముఫ్తీ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ సహా పలు పార్టీల నేతల నుంచి నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఫ్తీపై దేశద్రోహం కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్‌ చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కోరారు. ముఫ్తీ వ్యాఖ్య‌లు ఆమోద‌నీయం కాద‌ని.. త్రివ‌ర్ణ ప‌తాకం భార‌తీయుల ఐక్య‌త‌, స‌మ‌గ్ర‌త‌, త్యాగాల‌ను చాటుతుంద‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లో దాన్ని త‌క్కువ చేసే ప్ర‌య‌త్నం చేయొద్ద‌ని కాంగ్రెస్ హిత‌వు ప‌లికింది. (తీవ్ర దుమారం రేపుతున్న ముఫ్తీ వ్యాఖ్యలు )

మరిన్ని వార్తలు