చెప్పేది నాటువైద్యం, చేసేది దోపిడీలు 

4 Jan, 2023 08:10 IST|Sakshi

సాక్షి, బనశంకరి: ఆయుర్వేద మూలికలతో చికిత్స చేస్తామని చెప్పుకుంటూ ప్రజలవద్ద నుంచి డబ్బు దండుకుని వంచనకు పాల్పడుతున్న రాజస్థాన్‌ కు చెందిన ముగ్గురు వ్యక్తులను మంగళవారం బెంగళూరు విల్సన్‌ గార్డెన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులు మహమ్మద్‌ సమీన్‌ అలియాస్‌ డాక్టర్‌ మల్లిక్, సైఫ్‌ అలీ, మహ్మద్‌ రహీస్‌.  

ఇంటికెళ్లి రూ.8.8 లక్షలతో పరారు  
వివరాలు... నెలమంగల వద్ద టెంట్లు వేసుకుని నాటు మూలికలు ప్రదర్శిస్తూ మొండి రోగాలను నయం చేస్తామని ప్రజలను నమ్మించేవారు. శాంతినగర బసప్పరోడ్డు నివాసి పంకజ్‌ఠాకూర్‌ తన తల్లికి కాలి నొప్పికి చికిత్స చేయాలని వీరిని  గత నెల 16 తేదీన ఇంటికి తీసుకెళ్లాడు. చికిత్స చేయడానికి ఖర్చవుతుందని వారిని మాటల్లో పెట్టి రూ.8.8 లక్షలు తీసుకుని ఉడాయించారు.

బాధితులు ఫిర్యాదు చేయడంతో డీసీపీ శ్రీనివాసగౌడ, ఏసీపీ నారాయణస్వామి ఆధ్వర్యంలో ముఠాను గాలించి పట్టుకున్నారు. వారి నుంచి నాలుగుకార్లు, మూడు ద్విచక్రవాహనాలు రూ.3.50 లక్షలు నగదు, నాటు మూలికలను  స్వాధీనం చేసుకున్నారు. ఇలా వైద్యం పేరుతో ఎంతోమందిని మోసగించినట్లు అనుమానాలున్నాయి. 

(చదవండి: స్నేహితురాలి ఇంటికే కన్నం..మహిళకు ఆరేళ్లు జైలు శిక్ష)

మరిన్ని వార్తలు