మృత్యుంజయుడు.. ఈ బుడతడు

15 Jun, 2021 08:47 IST|Sakshi

ఆగ్రా: ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడిన మూడున్నరేళ్ల బాలుడిని సహాయక బృందాలు విజయవంతంగా కాపాడాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ధరిౖయె గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఉదయం 7.30 గంటల సమయంలో ఆడుకుంటున్న బాలుడు దగ్గర్లో ఉన్న పొలంలోని బోరు బావిలో పడిపోయాడు. ఈ విషయం వెంటనే అధికారులకు తెలియడంతో ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. 130 అడుగుల లోతున్న బోరుబావిలో 90 అడుగుల వద్ద బాలుడు చిక్కుకున్నాడు.

అధికారులు బోరుబావికి సమాంతరంగా భూమిని తవ్వి బాలున్ని సురక్షితంగా బయటకు తీశారు. బాలుడు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని జిల్లా కలెక్టర్‌ ప్రభు ఎన్‌ సింగ్‌ తెలిపారు. ఉదయం 8.30కి ప్రారంభమైన ఆపరేషన్‌ సాయంత్రం 4.35 గంటలకు ముగిసిందని ఆగ్రా ఎస్‌ఎస్‌పీ మునిరాజ్‌ తెలిపారు. తన కుమారున్ని తిరిగి ప్రాణాలతో చూడటం ఆనందంగా ఉందని బాలుడి తండ్రి ఛోటేలాల్‌ చెప్పారు. ఆరేడేళ్లుగా మూతబడి ఉన్న బోరు బావిని తిరిగి కొత్త బోరు వేసేందుకు తెరవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

చదవండి: Ayodhya: రూ.400 కోట్లతో బస్‌స్టేషన్‌

మరిన్ని వార్తలు