కరోనా కల్లోలం: 3.43 లక్షల కొత్త కేసులు

14 May, 2021 10:26 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 18,75,515 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 3,43,144 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం  కరోనా కేసుల సంఖ్య 2,40,46,809కి పెరిగింది.

దేశంలో ఒక్కరోజులోనే కరోనా బారినపడి 4 వేల మంది మృతి చెందారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,62,317కి చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 3,44,776 మంది డిశ్చార్జ్‌ కాగా, దేశంలో ఇప్పటివరకు 2,00,79,599 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 37,04,893 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 31,13,24,100 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దేశంలో ఇప్పటివరకు 17,92,98,584 మందికి వ్యాక్సిన్‌ వేశారు.

చదవండి: ఆక్సిజన్‌ అందక మరో 15 మంది మృత్యువాత
కోవిడ్‌పై యుద్ధం ప్రకటించిన గ్రామాలు

మరిన్ని వార్తలు