దేశంలో కొత్తగా 38,164 కరోనా కేసులు

19 Jul, 2021 10:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో గడిచిన 24 గంటల్లో 38,164 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,11,44,229కు చేరింది. దేశంలో కొత్తగా 499 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందగా.. ఇప్పటివరకు 4,14,108మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 4,21,665 యాక్టివ్‌ కేసులు ఉండగా.. కరోనానుంచి ఇప్పటివరకు 3,03,08,456మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా 40.64 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

మరిన్ని వార్తలు