దేశంలో 4.90 కోట్ల పెండింగ్‌ కేసులు

25 Jan, 2023 06:30 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో దాదాపుగా 4.90 కోట్ల పెండింగ్‌ కేసులు ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు చెప్పారు. పెండింగ్‌ కేసుల త్వరితగతి విచారణ కోసం ప్రభుత్వం, న్యాయవ్యవస్థ కలసికట్టుగా కృషి చేయాలన్నారు. అప్పుడే కక్షిదారులకు సత్వర న్యాయం జరుగుతుందని కేసుల విచారణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో రిజిజు మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఈ–కమిటీ చీఫ్‌గా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీ.వై. చంద్రచూడ్‌ చేస్తున్న కృషిని ప్రశంసించారు.

‘‘4.90 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇది చాలా పెద్ద సంఖ్య. అంటే చాలా మంది న్యాయం కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. న్యాయం జరగడం ఆలస్యమవుతోందని అంటే న్యాయం చెయ్యడం తిరస్కరించడంగానే భావించాలి. వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా చూడాలి’’ అని రిజిజు అన్నారు. కేంద్ర ప్రభుత్వం, న్యాయస్థానాల ఉమ్మడి కృషి కారణంగానే పెండింగ్‌ కేసుల భారాన్ని తగ్గించగలమని వివరించారు.

మరిన్ని వార్తలు