గుబులు రేపుతున్న కొత్త కరోనా, ఎన్ని కేసులంటే

1 Jan, 2021 16:30 IST|Sakshi

కొత్తగా మరో నాలుగు యూకే వేరియంట్‌ కరోనా కేసులు

హైదరాబాద్‌లో  తాజా మరొక కేసు

సాక్షి, న్యూఢిల్లీ: భారీ కేసులతో బ్రిటన్‌లోప్రకంపనలు రేపుతున్న కరోనా వైరస్ కొత్త మ్యూటెంట్ స్ట్రెయిన్ కేసులు భారత్‌లో కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా  మరో నాలుగు  కొత్త కరోనా పాజిటివ్‌ కేసులను అధికారులు గుర్తించారు. దీంతో   ఈ వైరస్‌ బారిన పడిన వారి  మొత్తం సంఖ్య  శుక్రవారం నాటికి 29కి చేరుకుంది.
 
తాజాగా కోవిడ్-19 యుకె వేరియంట్‌కు సంబంధించి కొత్తగా నాలుగు కేసులను భారతదేశంలో శుక్రవారం గుర్తించామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిల్లో మూడు బెంగళూరులో కనుగొనగా, ఒకటి హైదరాబాద్‌లో గుర్తించినట్టు వెల్లడించారు. ఇప్పటివరకు  ఈ వారం మంగళవారం, బుధవారం 20 మందికి పాజిటివ్‌ రాగా,  గురు శుక్రవారాల్లో, మరో తొమ్మిదిమంది వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో బెంగళూరు, ఢిల్లీలో 10 కేసులు చొప్పున, పశ్చిమ బెంగాల్‌లో ఒకటి, హైదరాబాద్‌లో మూడు, పూణేలో ఐదు కేసులను గుర్తించారు.  వీరందరినీ ఐసోలేషన్‌లో ఉంచి పరిశీలిస్తున్నామని మంత్రిత్వ శాఖ తెలిపింది. 

కాగా  2020, డిసెంబరులో యుకెలో మొట్టమొదటిసారిగా  గుర్తించిన ఈ కొత్త వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆందోళన రేపుతోంది. దీంతో  చాలా దేశాలు యూకేకు తమ విమాన సర్వీసులను నిలిపివేశాయి. భారతదేశం కూడా జనవరి 7 వరకు విమాన సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు