కాలుష్య వ్యాధుల కోరల్లో ఢిల్లీ

6 Nov, 2022 06:07 IST|Sakshi

న్యూఢిల్లీ: కాలుష్యకాసారంగా మారిన ఢిల్లీ–రాజధాని ప్రాంత పరిసరాల (ఎన్‌సీఆర్‌) ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొద్ది వారాలుగా ప్రతి ఐదింట నాలుగు కుటుంబాలు కాలుష్య సంబంధ వ్యాధులపాలవుతున్నాయని లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్థ సర్వేలో తేలింది. అందులో పాల్గొన్న వారిలో 18 శాతం ఇప్పటికే గాలి కాలుష్యంతో అస్వస్థులై ఆస్పత్రికి వెళ్లొచ్చారు. 80 శాతం కుటుంబాల్లో కనీసం ఇంటికొకరు ఒకరు శ్వాససంబంధ సమస్యను ఎదుర్కొంటున్నారు.

వాయు కాలుష్యంతో బెంబేలెత్తిపోయిన ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ ప్రాంత ప్రజలు కొందరు స్వస్థలాలు వదిలి వేరే ప్రాంతాలకు తాత్కాలికంగా తరలిపోయారు. ఇటీవల దీపావళి పర్వదినం సందర్భంగా బాణసంచా వినియోగంతో వెలువడిన దుమ్ము ధూళీతో పొగచూరిన ఢిల్లీలో ఐదు రోజుల తర్వాత ప్రజాభిప్రాయం తీసుకున్నారు. అప్పుడు సైతం ఇదే తరహా కాలుష్య సంబంధ ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయని 70 శాతం మంది పౌరులు ఆవేదన వ్యక్తంచేయడం గమనార్హం. ప్రభుత్వ పాలన, ప్రజాసంబంధాలు, పౌరుల, వినియోగదారుల ప్రయోజనాలు, ఎదుర్కొంటున్న కష్టాలపై సామాజిక మాధ్యమ వేదికగా లోకల్‌సర్కిల్స్‌ సంస్థ సర్వేలు చేస్తుంటుంది.

మరిన్ని వార్తలు