4,000 కిలోల మామిడి పండ్లు ద్వంసం.. ఎందుకంటే?

13 Jun, 2021 18:21 IST|Sakshi

చెన్నై: వేసవి కాలం వచ్చిందంటే ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందో అని ఎదురుచూసే పండు మామిడి. పండ్లలో రారాజుగా పిలుచుకునే ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు అని ప్రతీతి. అయితే కొందరు వ్యాపారులు వాటిని పండించడానికి పెస్టిసైడ్స్‌ వినియోగంచడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి. తాజాగా తమిళనాడులోని త్రిచి జిల్లాలో కృత్రిమంగా పండించిన ఓ నాలుగువేల కిలోల మామిడి పండ్లను ఆహార భద్రతా శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.

శనివారం గాంధీ మార్కెట్‌లో రసాయనాలు పిచికారీ చేసి మామిడి పండ్లను పండించినట్టు అధికారులకు సమాచారం అందింది. దీంతో జిల్లాలోని ఆహార భద్రతా విభాగ బృందం ఆఫీసర్ ఆర్ రమేశ్‌ బాబు నేతృత్వంలో గాంధీ మార్కెట్‌లోని పది గోడౌన్లపై దాడి చేశారు. పండ్లను కృత్రిమంగా పండించడానికి మూడు గోడౌన్లలో ఇథిలీన్ వాడినట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం నేరస్థులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు విక్రేతలను హెచ్చరించారు.

చదవండి: ప్రజలు మేకలా.. మంత్రులు తోడేళ్లా!


 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు