భారత్‌: 80 లక్షలకు చేరువలో కరోనా కేసులు

28 Oct, 2020 09:59 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 80 లక్షల మార్కుకు చేరువలో ఉంది. గడిచిన 24 గంటల్లో 43,893 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79,90,322కి చేరింది. నిన్న ఒక్క రోజే  508 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,20,010 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. నిన్న 58,439 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్‌ అవ్వగా ఇప్పటి వరకు మొత్తం 72,59,509 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,10,803 గా ఉంది. ( ఎకానమీ కోలుకుంటోంది కానీ.. )

కాగా, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,83,608 శాంపిళ్లను పరీక్షించామని, ఇప్పటివరకు 9,72,00,379 శాంపిళ్లను పరీక్షించామని ఐసీఎమ్‌ఆర్‌(ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) తెలిపింది.

మరిన్ని వార్తలు