కరోనా: దేశంలో రికవరీ రేటు 93.69 శాతం

22 Nov, 2020 10:07 IST|Sakshi

దేశంలో 45,882 కేసులు, 501 మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల్లో కొంత తగ్గుదల నమోదవుతోంది. గురువారం 45,882 కేసులు, శుక్రవారం  46,232 కేసులు నమోదవగా.. శనివారం 45,209 పాజటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90,95,807 కు చేరింది. కరోనాకు చికిత్స పొందుత్నువారిలో కొత్తగా 501 మంది ప్రాణాలు కోల్పోడంతో మొత్తం మరణాల సంఖ్య 1,33,227కు చేరింది. వైరస్‌ బాధితుల్లో తాజాగా 43,493 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 85,21,617 కు చేరింది. 4,40,962 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా కోవిడ్‌ బాధితుల రికవరీ రేటు 93.69 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 4.85 శాతం యాక్టివ్‌ కేసులున్నాయని, మరణాల రేటు 1.46 శాతంగా ఉందని బులెటిన్‌లో వెల్లడించింది.
(చదవండి: భారత్‌ బయోటెక్‌ మరో గుడ్‌న్యూస్‌)

మరిన్ని వార్తలు