బడికెళ్లాలంటే కాలి నడకే శరణ్యం

27 May, 2022 06:35 IST|Sakshi

48 శాతం మందికి అదే దిక్కు

నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే  

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 48 శాతం మంది విద్యార్థులు కాలినడకనే పాఠశాలలకు వెళ్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే(ఎన్‌ఏఎస్‌)–2021లో తేలింది. 18 శాతం మంది సైకిళ్లపై పాఠశాలలకు చేరుకుంటున్నట్లు వెల్లడయ్యింది. స్కూల్‌ ట్రాన్స్‌పోర్టు, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టును ఉపయోగించకుంటున్నవారు కేవలం 9 శాతం మంది ఉన్నారు. 8 శాతం మంది సొంత వాహనం(టూ వీలర్‌)పై, 3 శాతం మంది సొంత కార్లలో స్కూలుకు వెళ్తున్నారు.

పిల్లల విద్యాభ్యాసం విషయంలో కనీసం 25 శాతం స్కూళ్లకు విద్యార్థుల తల్లిదండ్రుల మద్దతు లేదని సర్వేలో గుర్తించారు. దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 720 జిల్లాల్లో 1.18 లక్షల స్కూళ్లకు చెందిన 34 లక్షల మంది విద్యార్థులు ఈ సర్వే పాల్గొన్నారు. ఇందులో భాగంగా గత ఏడాది నవంబర్‌ 12న 3, 5, 8, 10       తరగతుల విద్యార్థులను ప్రశ్నించారు. ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్‌ స్కూళ్లలో సర్వే చేపట్టారు. చివరిసారిగా 2017లో ఎన్‌ఏఎస్‌ సర్వే జరిగింది.

మరిన్ని వార్తలు