ఢిల్లీలో ఉగ్ర కలకలం..!

7 Dec, 2020 12:03 IST|Sakshi

పోలీసులపై కాల్పులకు పాల్పడిన నిందితులు

ఉగ్ర గ్రూపులతో సంబంధాలున్నట్లు అనుమానం

సాక్షి, న్యూఢిల్లీ: రైతుల ఉద్యమంతో దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలక్నొ సంగతి తెలిసిందే. ఇదే అదునుగా ముష్కరులు దేశంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు విపిపిస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం ఢిల్లీ పోలీసులకు, ఐదుగురు వ్యక్తులకు మధ్య ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. వీరిలో కొందరికి టెర్రర్‌ గ్రూపులతో సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తూర్పు ఢిల్లీలోని షాకార్‌పూర్‌ ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది.  పోలీసులు నిందితులని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు పంజాబ్‌కు చెందిన వారు కాగా.. ముగ్గురు జమ్మూ కశ్మీర్‌కు చెందిన వారు ఉన్నారు. (చదవండి: రైతుల కోసం రోడ్డెక్కుతాం..)

ఈ సందర్భంగా స్పెషల్‌ సెల్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు ప్రమోద్‌ సింగ్‌ కుశ్వాస్‌ మాట్లాడుతూ.. ‘ఎన్‌కౌంటర్‌ తర్వాత ఐదుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేశాం. వీరి వద్ద నుంచి ఆయుధాలు, ఇతర నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నాము. వీరిలో కొందరికి ఉగ్రవాద సంస్థలతో సంబంధ ఉన్నట్లు అనుమానిస్తున్నాం. దీని గురించి విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’ అని తెలిపారు

>
మరిన్ని వార్తలు