ఎయిర్‌ఫోర్స్‌లోకి 5 రఫెల్‌ యుద్ధ విమానాలు

10 Sep, 2020 10:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత అంబుల పొదిలోకి మరికొన్ని యుద్ధ విమానాలు చేరనున్నాయి. వాయుసేనకు సేవలందించేందుకు కొత్తగా మరో ఐదు రఫెల్‌ యుద్ధ విమానాలు సిద్ధమయ్యాయి. ఈ గురువారం అంబాల ఎయిర్‌వేస్‌లో రఫెల్‌ యుద్ధ విమానాలు అధికారికంగా చేరనున్నాయి. ఈ కార్యక్రమంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్, ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫోరెన్స్‌ పార్లీతో పాటు పలువురు ఇరుదేశాల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ ‘ సర్వ ధర్మ పూజ’  నిర్వహించనున్నారు. భారత్ ‌- చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో రఫెల్ యుద్ధ విమానాల కోసం భారత్‌ 59 వేల కోట్ల రూపాయలతో ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.  ( దక్షిణాన సైనికులు.. ఉత్తరాన నిర్మాణాలు )

తొలి దశలో జులై 29న 5 రఫెల్ యుద్ధ విమానాలు భారత్ చేరుకున్నాయి. ఆ రఫెల్ యుద్ధ విమానాలు 17వ స్క్వాడ్రన్‌లో చేరాయి. రఫెల్ చేరికతో భారత ఎయిర్‌ఫోర్స్ సామర్ధ్యం బలోపేతమైంది. కాగా, తూర్పు లద్దాఖ్‌ ప్రాంతానికి చైనా ఇప్పటికే సుమారు 150 యుద్ధ విమానాలను, ఇతర సహాయక హెలికాప్టర్లను తరలించింది. పాంగాంగ్‌ సరస్సుకు దక్షిణ తీరంలో భారత సైనికులను ఎంగేజ్‌ చేస్తూ.. ఉత్తర తీరంలో నిర్మాణ కార్యక్రమాలను కొనసాగించే వ్యూహాన్ని చైనా అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఉపగ్రహ ఛాయాచిత్రాలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు