శరీర బరువులో సగం ఉన్న కణితి, తొలగించిన డాక్టర్లు

22 Aug, 2020 18:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని 52 ఏళ్ల మహిళ కడుపులో నుంచి 50 కిలోల అండాశయ కణితిని డాకర్లు తొలగించారు. ఆమె శరీర బరువులో సగభాగం ఆ కణితే ఉండేదని డాక్టర్లు తెలిపారు. కణిత బాగా పెరిగిపోవడంతో ఆ మహిళకు కడుపులో నొప్పి విపరీతంగా వచ్చేది. అంతే కాకుండా ఆమె సంవత్సరం నుంచి విపరీతంగా బరువు పెరగడం మొదలుపెట్టింది. దీంతో అనేక నొప్పులు, నడవడం కష్టమవడం, నిద్రపోవడం ఇబ్బంది ఉండటం లాంటి సమస్యలు మొదలయ్యాయి.

ఆమె దగ్గరలో ఉన్న డాక్టరుకు చూపించుకోగా ఆయన ఇంద్రప్రస్థాన్‌ అపోలో హాస్పటల్‌కు వెళ్లాల్సిందిగా ఆ మహిళకు సూచించారు. పరీక్షలు చేసిన అపోలో డాక్టర్లు ఆమె అండశయంలో కణితి పెరుగుతున్నట్లు గుర్తించారు. మూడున్నర గంటల పాటు కష్టపడి ఆమె కడుపులోని కణితి తొలగించారు. దీంతో ఆమె శరీర బరువు 106 కేజీల నుంచి అమాంతం 56 కేజీలకు తగ్గిపోయింది. అంటే ఆమె శరీరంలో దాదాపు సగం బరువు ఈ కణితే ఉంది. చికిత్స అనంతరం ఆమెను ఆగస్టు 22న డిశార్జ్‌ చేశారు. ఇప్పటి వరకు ప్రపంచంలో  ఆపరేషన్‌ చేసిన కణిత ఇదేనని, అదివరకు కొయంబత్తూరుకు చెందిన మహిళ కడుపు నుంచి 2017 లో 34 కేజీల కణితను తొలగించామని డాక్టర్లు తెలిపారు.

చదవండి: ‘యూపీ సర్కార్‌ ఆ సూత్రాలను పాటించడం లేదు’


 

మరిన్ని వార్తలు