Corona In India: నిన్నటితో పోలిస్తే 40 శాతం అధికంగా కేసులు

8 Jun, 2022 10:44 IST|Sakshi

న్యూఢిల్లీ: భార‌త్‌లో క‌రోనా వైరస్‌ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. మొన్న‌టి దాకా అదుపులోనే ఉందనుకున్న మహమ్మరి మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొన్నిరాష్ట్రాల్లో పాటిజివ్‌ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. భారత్‌లో గడిచిన 24 గంటల్లో అయిదు వేలకుపైగా కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా 5, 223 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇది నిన్నటితో పోలిస్తే కేసుల్లో 40 శాతం పెరుగుల కనిపించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,31,90,282కి పెరిగింది. 

ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ కోవిడ్‌పై బుధవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.  మంగళవారం కోవిడ్‌తో ఏడుగురు మృత్యువాతపడ్డారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,24,715కు చేరింది. అయితే అత్యధికంగా 84శాతం కేసులు అయిదు రాష్ట్రాల్లోనే నమోదు అవుతున్నాయి. మహారాష్ట్రలో 1,881, కేరళలో 1,494, ఢిల్లీలో 450, కర్ణాటకలో 348, హర్యానాలో  227 మంది కరోనా బారినపడ్డారు. 

గత 24 గంటల్లో 3,345 మంది కోలుకున్నారు, దేశవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,26,36,710కి చేరింది. దేశంలో రికవరీ రేటు 98.72%గా ఉంది. యాక్టివ్‌ కేసులు 28,857 ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 1,94,43,26,416 డోసుల వ్యాక్సిన్లను కేంద్రం అందించింది. 


చదవండి: వెన్నులో వైరస్‌ల వణుకు.. ఒకటి పోతే మరొకటి!

మరిన్ని వార్తలు