దేశంలో 78 లక్షలు దాటిన కేసులు

24 Oct, 2020 09:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో  53,370 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 78,14,682 చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 650 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,17,956కు చేరుకుందని ఆరోగ్య శాఖ పేర్కొంది. కాగా, దేశంలో 89.78 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉండగా, మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 8.71  శాతం ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.51 శాతానికి మరణాల రేటు తగ్గింది. గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 12,69,479 కరోనా టెస్టులు నిర్వహించారు. ఇక ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం కరోనా టెస్ట్ ల సంఖ్య 10,13,82,564. దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు  6,80,680 ఉండగా, చికిత్స పొంది డిశ్చార్జ్‌ అయనవారి సంఖ్య  70,16,046గా ఉంది.
(చదవండి: మన ‘చేతుల్లోనే’.. మన ఆరోగ్యం)

భారత్‌లో అంతంత మాత్రమే
దేశంలో కరోనా రోగులకు ప్లాస్మా థెరపీ చికిత్స ద్వారా పెద్దగా ఫలితం లేదని బ్రిటీష్‌ మెడికల్‌ జర్నల్‌ తెలిపింది. ఏప్రిల్‌, మే మాసాల్లో భారత్‌లో ప్లాస్మా చికిత్సలపై చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయని వెల్లడించింది.

మరిన్ని వార్తలు