బ్లాక్‌ ఫంగస్‌తో 56 మంది మృతి 

5 Jun, 2021 00:24 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో మ్యూకర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) వ్యాధితో ఇప్పటి వరకు 56 మంది మరణించాని బీఎంసీ ఆరోగ్య విభాగం వెల్లడించింది. మృతుల్లో అధిక శాతం ఇతర ప్రాంతాలకు చెందినవారేనని, బీఎంసీ పరిధిలో బ్లాక్‌ ఫంగస్‌తో 14 మందే చనిపోయారని అధికారులు తెలిపారు. బీఎంసీ ఆస్పత్రుల్లో మే 31వ తేదీ వరకు 449 మంది బ్లాక్‌ ఫంగస్‌ రోగులు ఉన్నారని, వీరిలో 70 శాతం గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, కశ్మీర్‌ తదితర రాష్ట్రాలతో పాటు ఔరంగాబాద్, నాసిక్, ధులే, జల్గావ్‌ తదితర జిల్లాలకు చెందినవారు ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు