కోవిడ్‌ వల్ల అనాథలుగా 577 మంది బాలలు

26 May, 2021 09:24 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌ మరణాల వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లలు 577 మంది ఉన్నట్లు రాష్ట్రాలు వెల్లడించాయని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్పారు. ఈ పిల్లలందరనీ వారి దగ్గర బంధువుల వద్దే ఉంచి, జిల్లా కలెక్టర్ల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. వీరి పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం వహించడం లేదని, సంక్షేమం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

రాష్ట్రాలు, జిల్లాల స్థాయిలో పిల్లల గురించి వివరాలు కనుక్కుంటున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. మహిళా శిశుసంక్షేమ శాఖ సహా ఐక్యరాజ్యసమితికి చెందిన యూనిసెఫ్‌ సైతం వీరికి తోడ్పాటును అందిస్తున్నాయని వెల్లడించాయి.

(చదవండి: ఆస్పత్రిలో చేరిన బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి)
 

మరిన్ని వార్తలు