Viral Video: పాపం.. ! ఆ చిన్నారి తోపుడు బండిపై తండ్రిని..

12 Feb, 2023 09:45 IST|Sakshi

మధ్యప్రదేశ్‌లో ఓ చిన్నారి తండ్రిని తోపుడు బండిపై తీసుకువెళ్లున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కెర్లు  కొట్టడంతో సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియోలో ఓ ఆరేళ్ల చిన్నారి. తోపుడు బండిపై తండ్రిని ఆస్పత్రికి తీసుకుని  వెళ్తున్నట్లు కనిపించింది. ఆ తోపుడు బండి ముందు ఆ చిన్నారి తల్లి లాగుతున్నట్లు కనిపించింది.

సుమారు మూడు కిలోమీటర్లు వరకు అలానే తీసుకువెళ్లినట్లు ఆ వీడియోలో తెలుస్తుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీలో చోటు చేసుకుంది. ఆ కుటుంబం అంబులెన్స్‌ కోసం ప్రభుత్వాస్పత్రికి కాల్‌ చేసిన ఫలితం లేకుండాపోయింది. దాదాపు 20 నిమిషాల నిరీక్షణ తర్వాత కుటుంబ సభ్యులు ఆ వ్యక్తిని తోపుడు బండిపై సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు.

(చదవండి: బైక్‌పై దూసుకెళ్తూ మొబైల్‌ దొంగ దుర్మరణం! )

మరిన్ని వార్తలు