63 జిల్లాల్లో బ్లడ్‌ బ్యాంకులు లేవు

31 Jul, 2021 06:18 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో 3,500 లైసెన్స్‌డ్‌ బ్లడ్‌ బ్యాంకులు ఉండగా, 63 జిల్లాల్లో అసలు బ్లడ్‌ బ్యాంకులు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ శుక్రవారం లోక్‌సభలో తెలిపారు. జాతీయ రక్త విధానం కింద ప్రతి జిల్లాలో కనీసం ఒక్క బ్లడ్‌బ్యాంక్‌ అయినా ఉండేలా చూస్తున్నామని పేర్కొన్నారు. అయితే అర్బన్, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో ఉండే బ్లడ్‌ బ్యాంకులను కలపబోవడం లేదని తెలిపారు. ఎక్కువ పరిమాణంలో రక్తం దొరకే చోటు నుంచి దాన్ని నిల్వ చేసి, తక్కువగా దొరికే స్టోరేజీలకు పంపే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. దేశంలో చాలా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో జిల్లాల విభజన జరుగుతూ పోవడం వల్ల జిల్లాకో బ్లడ్‌ బ్యాంక్‌ ఉండటం లేదన్నారు. అలాంటి చోట్లకు పాత బ్లడ్‌బ్యాంకుల నుంచే రక్తం సరఫరా జరగాలన్నారు.

మరిన్ని వార్తలు