క్షయరోగుల్లో యువతే అత్యధికం!

10 Aug, 2021 03:45 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో క్షయ రోగం బారిన పడుతున్నవారిలో అత్యధికులు 15–45ఏళ్లలోపువారేనని ఆరోగ్య మంత్రి  మాండవీయ చెప్పారు. దేశంలో నమోదవుతున్న టీబీ కేసుల్లో 65 శాతం ఈ వయసు గ్రూపులోనివారేనని తెలిపారు. టీబీ కేసుల్లో 58 శాతం గ్రామీణ ప్రాంతాల్లో నమోదవుతున్నాయని, దీనివల్ల పలు కుటుంబాలు కుంగుబాటుకు గురవుతున్నాయని తెలిపారు. టీబీపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి సంబంధించిన వివరాలను ఆయన పార్లమెంట్‌ సభ్యులకు వివరించారు. ప్రతి ఎంపీ ఈ విషయంపై తమ నియోజకవర్గ ప్రజలకు అవగాహన కలి్పంచాలని కోరారు. 15–45 సంవత్సరాల మధ్య వయసు్కలంటే ఉత్పాదకత అధికంగా ఉండే వయసని, సరిగ్గా ఈ వయసులో టీబీ బారిన పడడం అటు వారికి, ఇటు దేశానికి నష్టదాయకమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్‌ వేళ టీబీని అడ్డుకోవడం కష్టసాధ్యంగా మారుతోందని ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి పవార్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు