పాక్‌లో 18 ఏళ్ల జైలు; స్వర్గంలోకి వచ్చినట్టుంది

27 Jan, 2021 13:01 IST|Sakshi

ఔరంగాబాద్ : తన భర్త తరపు బంధువుల్ని కలవడానికి పాకిస్తాన్‌ వెళ్లిన భారతీయ మహిళ హసీనాబేగం(65)కు 18ఏళ్ల తర్వాత ఎట్టకేలకు విముక్తి లభించింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పోలీసుల చొరవతో మంగళవారం ఆమె  పాక్ జైలు నుంచి విడుదలై తన స్వస్థలానికి చేరుకుంది. ఈ నేపధ్యంలో ఉద్వేగానికి లోనైన ఆమె  ''చాలా కష్టాలను ఎదుర్కొన్నాను. నా దేశానికి తిరిగి రాగానే స్వర్గంలోకి వచ్చినట్లుంది' అంటూ ఆనందం వ్యక్తం చేశారు.  (పోలీసుల అప్రమత్తం: పంజాబ్‌, హర్యానాలో హై అలర్ట్‌)

వివరాల ప్రకారం..ఔరంగ‌బాద్‌కు చెందిన హ‌సీనా బేగం అనే 65 ఏళ్ల మహిళ 18 ఏళ్ల క్రితం త‌న భ‌ర్త బంధువులను చూసేందుకు పాకిస్తాన్ వెళ్లింది. ఈ క్రమంలో పాస్‌పోర్టు పోగొట్టుకొని జైలు పాలయ్యారు. ఆమె అదృశ్యం అయినట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఆమె ఆచూకీ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇన్నేళ్లకు వారి కృషి ఫలించి హసీనాబేగం  పాకిస్తాన్‌ జైలు నుంచి విడుదలయ్యారు. ఔరంగాబాద్ పోలీసుల చొరవతో స్వదేశానికి తీసుకువచ్చిన హసీనాబేగం ఈ సందర్భంగా పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్వదేశానికి చేరుకోగానే ఆమె బంధువులు ఘన స్వాగతం పలికారు. (నాలుగేళ్ల అనంతరం చిన్నమ్మ విడుదల)


 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు