హైకోర్టు ఆగ్రహం: వారికి అనుమతించిన మహారాష్ట్ర

7 Aug, 2020 14:39 IST|Sakshi

ముంబై: చలనచిత్ర, టీవీ పరిశ్రమలో పనిచేసే 65 ఏళ్లకు పైబడిన నటీనటులు యధావిధిగా షూటింగ్‌ల్లో పాల్గొనేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కరోనా నేపథ్యంలో చైల్డ్‌ ఆర్టిష్టులు, సీనియర్‌ సిటిజన్లు అవుట్‌ డోర్‌ షూటింగ్‌లో పాల్గొనడానికి వీలు లేదని ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయం వారి కుటుంబాలకు ఆర్థిక సవాలుగా మారింది. ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ప్రమోద్‌ పాండే అనే సీనియర్‌ నటుడు జూలై 21 హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. ఇటీవల ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులను ముంబై హైకోర్టు రద్దు చేసింది.  65 ఏళ్లు పైబడిన నటులను షూటింగ్‌లకు అనుమతించకపోవడం వెనుక ఉన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వివరించాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది.
(చదవండి: మహారాష్ట్రలో 10,163 మంది పోలీసులకు కరోనా)

అయితే కరోనా నేపథ్యంలో 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు, 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న సిబ్బందిని షూటింగ్‌లో పాల్గొనడాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ప్రమోద్‌ పాండే పిటిషన్‌పై విచారణ చేపట్టిన ముంబై హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒక సీనియర్ సిటిజన్ తన దుకాణం తెరిచి రోజంతా కూర్చోవడానికి అనుమతి ఉన్నప్పుడు.. 65 ఏళ్లు పైబడిన నటీనటులు బయటకు వెళ్లకుండా ఏ ప్రాతిపదికన నిరోధించారని పేర్కొంది. ఇది వివక్ష చూపేదిగా ఉందంటూ ప్రభుత్వ తీరుపై ముంబై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో హైకోర్టు ఆదేశం మేరకు సీనియర్‌ సిటిజన్‌లు తిరిగి షూటింగ్‌లో పాల్గొనేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. (చదవండి: కరోనా: 38 శాతం ఐదు రాష్ట్రాల నుంచే!)

మరిన్ని వార్తలు