కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌.. ఏడుగురికి అస్వస్థత

18 Jan, 2021 15:28 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశ వ్యాప్తంగా శనివారం నుంచి కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. శనివారం మొదటి ఫేజ్‌ కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించగా..  2,24,301 మంది హెల్త్‌ కేర్‌ వర్కర్లు వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. అయితే  కోవిడ్ -19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఇప్పటివరకు 447 సైడ్‌ ఎఫెక్టివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మహారాష్ట్రలో సీరమ్‌ ఇస్స్టిట్యూట్‌  కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న ఏడుగురు ఆదివారం ఆస్పత్రి బారిన పడినట్లు,  ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి కారణాలతో అకోలా, బుల్దానా ఆస్పత్రుల్లో చేరినట్లు అధికారులు వెల్లడించారు.వారంతా బాగానే ఉన్నారని, నేడు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. చదవండి: ఢిల్లీలో 52 మందిలో వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్

టీకాలు తీసుకున్న వారిలో ఎవరూ కూడా తీవ్రమైన దుష్ప్రభావాలతో బాధపడలేదని అమరావతి సివిల్ సర్జన్ డాక్టర్ శ్యామ్‌సుందర్ నికం తెలిపారు. అమరావతి జిల్లాలోని మరో నాలుగు కేంద్రాల్లో 100 మందికి కోవిషీల్డ్ అందించారని, వారిలో నలుగురు, అయిదుగురికి జ్వరం, కండరాల నొప్పులున్నాయని ఫిర్యాదు చేశారన్నారు. అయితే వారి పరిస్థితి తీవ్రంగా లేనందున వారిని ఆసుపత్రిలో చేర్చలేదన్నారు. శనివారం మహారాష్ట్రలోని ఆరు కేంద్రాలలో మాత్రమే కోవాక్సిన్ నిర్వహించారు. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు