దేశంలో కరోనా మరణాల రేటు 1.57 శాతం

5 Oct, 2020 10:19 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటలలో 74,442 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 903 మంది మృతి చెందారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు సోమవారం హెల్త్‌ బుటిటెన్‌ విడుదల చేసింది. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 66,23,816గా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసులు 9,34,427గా ఉండగా.. కరోనా చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 55,86,703కు చేరింది.

కోవిడ్‌ వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,02,685కు చేరింది. కరోనా బాధితుల రికవరీ రేటు 84.34 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసుల్లో మరణాల రేటు 1.57 శాతానికి తగ్గింది. మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 14.11  శాతంగా ఉన్నాయి. గడచిన 24 గంటలలో 9,89,860 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. దేశంలో ఇప్పటి వరకు చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 7,99,82,394గా ఉంది.  (కోవిడ్‌ నియంత్రణలో ఏపీ, తమిళనాడు భేష్‌)

>
మరిన్ని వార్తలు