ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్‌ చేస్తున్న 76 ఏళ్ల బామ్మ

24 May, 2021 20:47 IST|Sakshi
వీడియో దృశ్యాలు

మన జీవితం చాలా చిన్నది. ఎంత చిన్నదంటే వెలుగు, చీకట్ల మధ్య ఓ రెప్పపాటు కాలమంత.. తల్లి కడుపులోంచి బిడ్డగా లోకాన్ని చూసే వెలుతురు.. మరణించినపుడు కళ్లలో నింపుకునే చీకటి.. ఇదే జీవితం. ఇంత చిన్న జీవితానికి హద్దులు పెట్టి.. ఇలా బ్రతకాలి.. అలా బ్రతకాలి.. అది చేయకూడదు.. ఇది చేయకూడదు అంటూ ఆంక్షలు. మానవ జన్మకు పరిపూర్ణత ఎప్పుడంటే మనం మనలా బ్రతికినపుడు.. మనం అనుకున్నది చేసినపుడు. మనకోసం మనం బ్రతికినపుడు. మనకు ఆనందాన్నిచ్చే పని ఏదైనా ఇతరులకు నష్టం,కష్టం కలగకుండా చేసినపుడు.

నచ్చిన పని చేయటానికి స్త్రీ, పురుష తేడా లేదు.. వయసు అడ్డుకాదు. ఈ సిద్ధాంతాన్నే ఫాలో అయింది మహారాష్ట్రలోని ముంబైకి చెందిన 76 ఏళ్ల మిసెస్‌ వర్మ. న్యూలుక్స్‌.. స్టెప్పులతో వీడియోలు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయటం మొదలుపెట్టింది. అప్పుడప్పుడు భర్తతో కలిసి కూడా వీడియోలు చేసింది. ఆమె వీడియోలు ఫన్నీగా ఉండటంతో వైరల్‌గా మారి పిచ్చ ఫేమస్‌ అయిపోయింది. మిసెస్‌ వర్మ వీడియోలను చూస్తున్న నెటిజన్లు‘‘ బామ్మ అదరగొడుతోంది... బామ్మను చూసినేర్చుకోవాలి మనం’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

దీనిపై మిసెస్‌ వర్మ మాట్లాడుతూ.. ‘‘ లాక్‌డౌన్‌ టైంలో మా మనవరాలు నాకు ఇన్‌స్టాగ్రామ్‌ ఎలా వాడాలో నేర్పించింది. ఇక అప్పటినుంచి ఇన్‌స్టాగ్రామ్‌ అలవాటైపోయింది. కొత్త కొత్త వేషధారణలతో.. స్టెప్పులతో వీడియో చేయటం మొదలుపెట్టాను. మా ఆయన మీద ఫ్రాంక్‌లు చేసేదాన్ని. నేను సెల్ఫీ క్వీన్‌ను. మనకు నచ్చింది చేయటానికి వయసు అడ్డుకాదు’’ అని చెప్పుకొచ్చింది.

A post shared by @mr._and_mrs._verma

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు