ఢిల్లీని వణికిస్తున్న మంకీపాక్స్.. 24ఏళ్ల మహిళకు పాజిటివ్‌

11 Sep, 2022 12:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. దీంతో దేశ రాజధానిలో ఈ వ్యాధి బాధితుల సంఖ్య 7కు పెరిగింది. నైజీరియాకు చెందిన 24 ఏళ్ల మహిళ నాలుగు నెలలుగా ఢిల్లీలోని శారదా విహార్‌లో ఉంటోంది. ఇటీవలే జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలతో లోక్‌నాయక్ ఆస్పత్రిలో చేరింది. వైద్యులు నమూనాలను పూణె వైరాలజీ ల్యాబ్‌కు పంపగా.. రిపోర్టులో మంకీపాక్స్ పాజిటివ్ అని తేలింది. వెంటనే బాధితురాలితో సన్నిహితంగా ఉన్నవారి వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఢిల్లీలోని లోక్‌నాయక్ ఆస్పత్రిలో ఇప్పటివరకు మొత్తం ఏడు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ముగ్గురు పురుషులు కాగా.. నలుగురు మహిళలు. ఏడుగురిలో ఆరుగురు నైజీరియాకు చెందిన వారే కావడం గమనార్హం. ఒక్కరు మాత్రమే ఢిల్లీ వాసి. అయితే ఏడుగురు బాధితుల్లో ఐదుగురు ఇప్పటికే కోలుకున్నారు. మిగతా ఇద్దరు ప్రస్తుతం ఆస్పత్రిలోనే ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. మరోవైపు కేరళలో ఇప్పటివరకు ఐదు మంకీపాక్స్ కేసులు నమొదయ్యాయి.
చదవండి: భారత్ జోడో యాత్రలో రాహుల్‌కు పెళ్లి ప్రపోజల్!

మరిన్ని వార్తలు