మొబైల్‌ ఫోన్‌ పేలి ఎనిమిదేళ్ల చిన్నారి మృతి

25 Apr, 2023 12:34 IST|Sakshi

సాక్షి, తిరువనంతపురం: మొబైల్‌ ఫోన్‌ పేలి ఎనిమిదేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన కేరళలోని తిరువిల్వమలలో చోటు చేసుకుంది. ఈ మేరకు ఎనిమిదేళ్ల అదిత్య శ్రీ అనే చిన్నారి మొబైల్‌ ఫోన్‌ ఉపయోగిస్తుండగా చిన్నారి ముఖంపైనే పేలింది. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.

ఈ ఘటన సోమవారం రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆ చిన్నారి స్థానిక స్కూల్లో మూడో తరగతి చదువుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మొబైల్‌ ఫోన్‌ పేలుడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.  

(చదవండి: ఐఏఎస్‌ హత్య కేసు నిందితుడి విడుదల దుమారం..బిహార్‌ సీఎంపై విమర్శలు)

మరిన్ని వార్తలు