80 ఏళ్ల వయసులోనూ ఫుల్ జోష్.. మారథాన్‌లో అదరగొట్టిన బామ్మ.. వీడియో వైరల్..

19 Jan, 2023 14:31 IST|Sakshi

ముంబై: పట్టుదల ఉంటే వయసుతో  సంబంధం లేకుండా ఏమైనా సాధించవచ్చని మరోమారు నిరూపించారు మహారాష్ట్ర ముంబైకి చెందిన ఓ బామ్మ. 80 ఏళ్ల వయసులో మారథాన్‌లో పాల్గొన్నారు.  స్నీకర్స్ ధరించి చీరకట్టులో పరుగులు తీశారు.  చేతిలో జాతీయ జెండా కూడా పట్టుకున్నారు. 51 నిమిషాల్లో 4.2కిలోమీటర్లు పరుగెత్తి శభాష్ అనిపించుకున్నారు.

టాటా ముంబై  మారథాన్ 18వ ఎడిషన్ ఆదివారం ఘనంగా జరిగింది. దాదాపు 55,000 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. 80 ఎళ్ల బామ్మ కూడా ఇందులో భాగమయ్యారు. ఆమె మనవరాలు ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది.

ఈ బామ్మ చాలా మందికి స్ఫూర్తి. వయసు అనేది కేవలం నంబర్ మాత్రమేనని ఈమె నిరూపించారు. అని కొందరు నెటిజన్లు ప్రశంసించారు. కాగా.. ఈ మారథాన్‌లో పాల్గొనడం తనకు ఇది ఐదోసారి అని బామ్మ తెలిపారు. తాను భారతీయురాలినని సగర్వంగా చెప్పేందుకే చేతిలో జాతీయ జెండా పట్టుకున్నట్లు వివరించారు.
చదవండి: పేదలకు ప్రతి నెలా రూ.2,000.. కర్ణాటక మంత్రి కీలక ప్రకటన

మరిన్ని వార్తలు