గొంతులో అన్నం మెతుకు ఇరుక్కుని చిన్నారి మృతి

12 Apr, 2021 15:11 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పావగడ: గొంతులో అన్నం మెతుకు ఇరుక్కుని 9 నెలల చిన్నారి మృతి చెందాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం పావగడ తాలూకాలోని రాజవంతి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన రాజప్ప, భారతి దంపతులకు సత్య (9 నెలలు) సంతానం. ఆదివారం ఉదయం భారతి వంట చేస్తుండగా... కుమారుడు సత్య ఆడుకుంటున్నాడు.

ఈ క్రమంలో బాలుడు పక్కనే ఉన్న గిన్నెలోని అన్నం తినేందుకు ప్రయత్నించగా...అన్నం మెతుకు గొంతులో ఇరుక్కుని ఊపిరి ఆడక ఏడ్వటం ప్రారంభించాడు. వెంటనే గుర్తించిన భారతి చిన్నారిని తీసుకుని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లింది. అయితే ఆ సమయంలో చిన్న పిల్లల వైద్యుడు అందుబాటులో లేకపోవడం.. వైద్యం అందించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో బాలుడు మృత్యువాత పడ్డాడు. 

చదవండి: బ్యాంకులో ఉరివేసుకున్న మహిళ బ్యాంక్ మేనేజర్

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు