'నేను జైలు పాలైన జర్నలిస్ట్‌ కూతురుని'...అంటూ చిన్నారి ప్రసంగం! వైరల్‌

17 Aug, 2022 12:27 IST|Sakshi

న్యూఢిల్లీ: తొమ్మిదేళ్ల చిన్నారి తన పాఠశాలలో ఇచ్చిన ప్రసంగం నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె స్వాత్రత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా.. పాఠశాల్లో ప్రసంగించింది. ఆమె తన ప్రసంగాన్ని ‘నేను  పౌర హక్కులు హరించడం కారణంగా కటకటాల పాలైన జర్నలిస్ట్‌ కుమార్తెని’ అని ప్రారంభించి అందర్నీ విస్మయపర్చింది. సుమారు రెండు నిమిషాల నిడివి గల ఆ వీడియోలో పౌరులు హక్కులు, మతం, హింసకు తావిచ్చే రాజకీయాలు  గురించి ప్రసంగించి ఆశ్చర్యపరిచింది.

ఆ చిన్నారి తన ప్రసంగంలో... ‘ప్రతి భారతీయుడికి ఏం మాట్లాడాలి, ఏం తినాలి, ఏ మతాన్ని అనుసరించాలి వంటివి నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. ఇవన్ని మహాత్మ గాంధీ, నెహ్రు, భగత్‌ సింగ్‌ వంటి స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలు, త్యాగాల వల్లే సాధ్యమైంది. నాటి సమరయోధులను స్మరిస్తూ.. పౌరుల సాధారణ స్వేచ్ఛ హక్కులను హరించొద్దు ఇదే నా అభ్యర్థన. నా మాతృభూమిని చూసి గర్విస్తున్నాను, దీన్ని లొంగదీసుకోవాలని చూడకూడదు.

మనం 76వ స్వాతంత్య్ర దినోత్సవంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తిరుగులేని ఆనందం, అధికారం కలిగిన ఒక భారతీయురాలిగా "భారత మాతకి జై" అని చెప్పాలనుకుంటున్నాను’ అంటూ ప్రసంగం ముగించింది. ఆ చిన్నారి తండ్రి మలయాళ వార్త ఛానెల్‌ అజీముఖం రిపోర్టర్‌ సిద్దిక్‌ కప్పన్‌.

అక్టోబర్‌ 2020లో అత్యాచారానికి గురైన 19 ఏళ్ల దళిత మహిళ గురించి రిపోర్టింగ్‌ని నివేదించడానికి వెళ్తుండగా అతడి తోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. భద్రతలకు విఘాతం కలిగించాడనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. తనను అకారణంగా జైలు పాలుచేశారని, తాను నిర్దొషినని సిద్ధిక్‌ పేర్కొన్నాడు. అతడి బెయిల్‌ దరఖాస్తును సైతం అలహాబాద్‌ లక్నో హైకోర్టు బెంచ్‌ తిరస్కరించింది. 

(చదవండి: జాతీయ వ్యతిరేకులకు కాంగ్రెస్‌ మద్దుతిస్తోంది: కేఎస్‌ ఈశ్వరప్ప)

మరిన్ని వార్తలు