ప్రధాని మోదీకి 93 మంది మాజీ ఐఏఎస్‌లు లేఖ

6 Jun, 2021 22:08 IST|Sakshi

తిరువనంతపురం: లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ 93 మంది విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తమకు ఏ పార్టీతో సంబంధం లేదని, తాము ఏ పార్టీ సభ్యులం కాదని, తమకు కేవలం రాజ్యాంగం మీద నమ్మకం ఉందని వారందరూ ఆ లేఖలో పేర్కొన్నారు. 

''అభివృద్ధి పేరుతో లక్షద్వీప్‌లో జరుగుతున్న పరిణామాలపై తీవ్రమైన ఆందోళన చెందుతూ ఈ లేఖ రాస్తున్నాం. అడ్మినిస్ట్రేటర్ రూపొందించిన ముసాయిదాలో లక్షద్వీప్ వాసుల నీతి, ప్రయోజనాలకు విరుద్ధమైన నిర్ణయాలు ఉన్నాయి. అడ్మినిస్ట్రేటర్ రూపొందించిన ముసాయిదాలో ప్రతి అంశం కూడా లక్షద్వీప్ భౌతిక స్వరూపాన్ని, వాతావరణాన్ని పూర్తిగా తలకిందులు చేసే విధంగా ఉండడంతో పాటు ఏకపక్ష విధానంగా కొనసాగింది. ముసాయిదాను రూపొందించే సమయంలో లక్షద్వీప్ ప్రజలను కానీ, అక్కడి సమాజాన్ని కానీ సంప్రదించలేదు'' అంటూ మాజీ ఐఏఎస్‌లు పేర్కొన్నారు. 
చదవండి: లక్షద్వీప్ భవిష్యత్తు తలచుకుంటే భయం వేస్తుంది.. 

లక్షద్వీపంలో అలజడి!

మరిన్ని వార్తలు