దేశంలో పెరిగిన పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య

2 Jun, 2021 10:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. అయితే కేసుల నమోదులో తగ్గుదల.. పెరుగుదల కనిపిస్తోంది. నిన్న మంగళవారం కేసులు తగ్గగా నేడు బుధవారం స్వల్పంగా పెరిగాయి. నిన్న లక్షా 27 వేల కేసులు నమోదు కాగా నేడు లక్షా 32 వేల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం. దేశంలో కొత్తగా 1,32,788 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం కరోనా బులెటిన్‌లో తెలిపింది. అయితే మరణాల్లో కూడా పెరుగుదల కనిపించింది. 24 గంటల్లో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,207.

ఇక కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 2,31,456 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. వీరితో కలిపి ఇప్పటివరకు 2,61,79,085 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసులు 17,93,645. 24 గంటల్లో 20,19,773 మందికి కరోనా పరీక్షలు చేయగా వీటిని కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిపిన పరీక్షలు 35,00,57,330. టీకాల పంపిణీ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. దేశంలో ఇప్పటివరకు వ్యాక్సిన్‌ పొందిన వారు 21,85,46,667 మంది ఉన్నారు.

చదవండి: మూడో దశ కరోనాపై సర్కార్‌ హైఅలర్ట్‌
చదవండి: కరోనాతో ప్రముఖ ఫుట్‌బాల్‌ కోచ్‌ మృతి

మరిన్ని వార్తలు