వైరల్‌: బుడ్డోడి కష్టాలు.. నెటిజన్ల నవ్వులు!

25 Nov, 2020 11:41 IST|Sakshi

ముంబై: చిన్నపిల్లలకు జుట్టు కత్తిరించేటప్పుడు వాళ్లు చేసే విన్యాసాలు మామూలుగా ఉండవు మరి!  ప్రస్తుతం అలాంటి వీడియోనే నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తన జుట్టు పొట్టిగా కత్తిరించారని, ఏడుస్తూ, కోపం నటిస్తున్న పిల్లాడిని చూస్తుంటే నవ్వు ఆపుకోలేరు. ‘‘అయ్యో పిల్లాడికి పెద్ద కష్టం వచ్చిందే’’ అని ప్రస్తుతం నెటిజన్లంతా నవ్వుకుంటున్నారు. వివరాలు.. నాగ్‌పూర్‌లో నివసిస్తున్న అనుప్ పేట్కర్, తన కుమారుడు అనుశ్రుత్‌కు జుట్టు కత్తిరిస్తున్నప్పుడు చిత్రీకరించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది.

‘‘నాకు చాలా కోపం​ వస్తోంది.. అసలు మీరేం చేస్తున్నారు? నేను చాలా పెద్ద వాడిని తెలుసా.. నిన్ను కొడతాను, నీ జుట్టు కత్తిరిస్తాను.. అంతేగానీ నాకు కటింగ్‌ చేయనివ్వను’’ అంటూ బుడ్డోడు అంటున్న మాటలు సోషల్‌ మీడియాలో నవ్వుల పువ్వులు పూయిస్తున్నాయి. ‘‘అరే చింటూ భలే క్యూట్‌ గా ఉన్నావ్‌ రా’’ అంటూ నెటిజన్లంతా చిలిపి కామెంట్స్‌ చేస్తున్నారు. ‘కట్టింగ్‌ చేసిన మామ.. తన పొడవాటి జుట్టును కత్తిరించడంతో పిల్లవాడికి కోపం వచ్చింది. ఏడుపు తగ్గించడానికి నేను చేసిన పనులు పిల్లవాడికి మరింత కోపం తెప్పించాయి’’ అంటూ.. కటింగ్‌ అయిపోయిన తర్వాత బాలుడి తండ్రి రెండో వీడియోను ట్వీటర్‌లో షేర్‌ చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా