కేజ్రీవాల్‌కు బిగ్‌ షాక్‌.. టవర్‌ ఎక్కి ఆప్‌ నేత ఆత్మహత్యాయత్నం!

13 Nov, 2022 12:50 IST|Sakshi

దేశంలో పలు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ అడుగులు వేస్తోంది. ఇక, ఢిల్లీలో కూడా మున్సిపల్‌ ఎన్నికల్లో ఆప్‌ విజయం సాధించేందుకు ప్లాన్‌ రచిస్తోంది. ఈ తరుణంలో అధికార కేజ్రీవాల్‌ సర్కార్‌కు ఊహించని షాక్‌ తగిలింది. 

అయితే, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో(ఎంసీడీ) పోటీ చేసేందుకు తనకు టిక్కెట్ ఇవ్వలేదనే కారణంతో మాజీ కార్పొరేటర్‌ హసీబ్‌ ఉల్‌ హసన్‌ నిరసనకు దిగారు. ఢిల్లీలోని శాస్త్రి నగర్‌ పార్క్‌ మెట్రో స్టేషన్‌ వద్ద ఉన్న హైటెన్షన్‌ టవర్‌ ఎక్కి నిరసనకు దిగారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. ఈ సందర్భంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ తప్పుడు విధానాలను ఎత్తిచూపారు. పార్టీ కోసం ఎంత కృషి చేసిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌ తనను మోసం చేశారని షాకింగ్‌ కామెంట్స్‌. కాగా, సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడి చేరుకున్నట్టు తెలుస్తోంది. 

ఇక, ఢిల్లీలో మున్సిపల్‌ ఎన్నికల కోసం ఆప్‌ రెండు జాబితాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మొదటి జాబితాలో 134 మందికి, రెండో జాబితాలో 117 మందితో లిస్ట్‌ రిలీజ్‌ చేసింది. ఇక, తొలి జాబితాలో 134 మందిలో 70 మంది మహిళలకు టిక్కెట్లు ఇవ్వగా, మాజీ ఎమ్మెల్యే విజయేందర్ గార్గ్‌ను నరైనా నుండి ఆప్ రంగంలోకి దింపింది. మరోవైపు, కాంగ్రెస్ నుంచి ఆప్‌లో చేరిన సీనియర్ కౌన్సిలర్ ముఖేష్ గోయల్ ఆదర్శ్ నగర్ వార్డు నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. కాగా, డిసెంబర్‌ 4వ తేదీన ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు జరుగనున్నాయి. 

మరిన్ని వార్తలు