షాకింగ్.. అసెంబ్లీలో లంచం డబ్బు.. నోట్ల కట్టలతో ఆప్ ఎ‍మ్మెల్యే ఆరోపణలు..

19 Jan, 2023 07:40 IST|Sakshi

న్యూఢిల్లీ: ఒక కాంట్రాక్టర్‌ లంచం ఆశజూపి తన నోరు మూయించజూశారని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మొహీందర్‌ గోయల్‌ ఆరోపించారు. ఆ డబ్బు ఇదేనంటూ బుధవారం ఢిల్లీ అసెంబ్లీలో కరెన్సీ కట్టలను చూపించారు. ‘‘ఓ ప్రభుత్వాస్పత్రికి సంబంధించి కొత్త కాంట్రాక్టర్‌ వచ్చాక 80 శాతం పాత కాంట్రాక్ట్‌ సిబ్బందిని తీసేసి లంచాలు తీసుకుని కొత్తవారిని నియమిస్తున్నాడు.

దీనిపై నోరు మెదపకుండా ఉండేందుకు నాకు లంచం ఇవ్వబోయాడు. ఇది 2022 ఫిబ్రవరిలో జరిగింది. వెంటనే ఢిల్లీ పోలీసులకు, ఏసీబీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు’’ అని ఆరోపించారు. ‘‘నాకు వారి నుంచి ప్రాణ హాని ఉంది. కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్‌చేశారు. ఇది ఉన్నతస్థాయి కుట్ర అని ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, తీవ్రమైన అంశమని స్పీకర్‌ రాంనివాస్‌ అన్నారు. ఇది నిజమే అయితే లంచమిచ్చేటపుడే రెడ్‌ హ్యాండెడ్‌గా ఎందుకు పట్టుకోలేదని బీజేపీ సభ్యులు ప్రశ్నించారు.
చదవండి: బీజేపీది రెండు నాల్కల వైఖరి: మమత

మరిన్ని వార్తలు