నూతన, పునరుత్పాదక ఇంధన శాఖకు రూ.37,828.15 కోట్లు 

2 Feb, 2023 06:07 IST|Sakshi

న్యూఢిల్లీ:  కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖకు బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.37,828.15 కోట్లు కేటాయించింది. గత ఏడాది బడ్జెట్‌లో సవరించిన అంచనా(రూ.27,547.47 కోట్లు)తో పోలిస్తే ఇది 37 శాతం అధికం. ఈ శాఖ ఆధ్వర్యంలోని రెండు సంస్థలకు బడ్జెట్‌లో కేంద్రం భారీ కేటాయింపులు చేసింది.

తాజా బడ్జెట్‌లో ఇండియన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(ఐఆర్‌ఈడీఏ)కి రూ.35,777.35 కోట్లు కేటాయించారు. అలాగే సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఈసీఐ)కి రూ.2,050.80 కోట్లు కేటాయించారు. ఇంధన రంగంలో కొత్త ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందజేయడానికి ఐఆర్‌ఈడీఏ 1987లో ఏర్పాటయ్యింది. నేషనల్‌ సోలార్‌ మిషన్‌(ఎన్‌ఎస్‌ఎం) అమలు, ఈ రంగంలో లక్ష్యాల సాధన కోసం ఎస్‌ఈసీఐని 2011లో నెలకొల్పారు.    

మరిన్ని వార్తలు