ఐఏఎస్‌ అధికారిణి ఇంటిపై ఏసీబీ దాడులు

7 Nov, 2020 17:59 IST|Sakshi

బెంగళూరు : కర్ణాటక మహిళా ఐఏఎస్‌ అధికారి నివాసంపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు.  ‌కర్ణాట‌కలోని ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ బ‌యోటెక్నాల‌జీ శాఖ‌లో ఆఫీస‌ర్‌గా ప‌ని చేస్తున్న సుధ ఇంట్లో శనివారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏసీబీ అధికారులు న‌గ‌దు, బంగారు ఆభ‌ర‌ణాల‌ను భారీగా స్వాధీనం చేసుకున్నారు.  

ఓ ఫిర్యాదు ఆధారంగా.. శనివారం ఉదయం కొడిగ‌హ‌ల్లి, యెల‌హంక‌లో, మైసూరు, ఉడిపిలో ఉన్న సుధ ఇళ్లపై ఏక కాలంలో ఏసీబీ దాడులు జరిపింది. బెంగుళూరు డెవ‌ల‌ప్మెంట్ అథారిటీలో ఆమె గ‌తంలో ల్యాండ్ అక్విజిష‌న్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేశారు. ప్రస్తుతం సుధ బ‌యోటెక్నాల‌జీ డిపార్ట్‌మెంట్‌లో అడ్మినిస్ట్రేటీవ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సుధ అవినీతికి సంబంధించి లోకాయుక్తలో పిటిషన్‌ దాఖలు చేయడంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సుధ భర్త శాండల్‌వుడ్‌లో సినీ నిర్మాత. అక్రమంగా సంపాదించిన డబ్బుతో సుధ భర్త సినిమాలను నిర్మిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు