వ్యాక్సిన్‌: ‘అలాంటివారిపై ఓ కన్నేసి ఉంచండి’

26 Jan, 2021 02:06 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌ సామర్థ్యంపై ప్రజల్లో అపోహలు రేకెత్తిస్తూ, తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ పుకార్లు పుట్టించేవారిపై ఓ కన్నేసి ఉంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కోవిడ్‌ వ్యాక్సిన్‌లపై తప్పుడు వార్తలు ప్రచారం చేసేవారిని గుర్తించి, అటువంటి వారిపై తగు చర్యలు తీసుకోవాలని కేంద్రం, రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమాచారమిచ్చారు. అందులో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేస్తోన్న కోవిషీల్డ్, భారత్‌ బయోటెక్‌ తయారుచేస్తోన్న కోవాగ్జిన్‌ సురక్షితమైనవి అజయ్‌ భల్లా అన్నారు.

ఈ రెండు వ్యాక్సిన్లు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని దేశంలోని నేషనల్‌ రెగ్యులేటరీ అథారిటీ గుర్తించిన విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. భారత్‌లో తయారు చేస్తోన్న ఈ రెండు వ్యాక్సిన్‌ల వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు జనవరి 16 కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే. అయితే ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు పొందిన ఈ రెండు వ్యాక్సిన్‌ల సమర్థతపై అనేక అనుమానాలకు తావిస్తూ, అపోహలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిపట్టించే ప్రయత్నం సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అలా చేస్తే చర్యలు తప్పవన్నారు.   

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు