నితిన్‌ గడ్కరీని కలిసిన సంజయ్‌ దత్‌

6 Jun, 2021 20:28 IST|Sakshi

నాగ్‌పూర్‌: కేంద్ర ర‌వాణాశాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ, ఆయ‌న భార్య కాంచ‌న్ గ‌డ్క‌రీని బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ ఆదివారం నాగ‌పూర్‌లోని వారి నివాసంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశాడు. సంజయ్ దత్ ఏ కారణంగా గడ్కరీతో భేటీ అయ్యారన్నది తెలియదు. ఇరువరి మధ్య ఏ విషయంపై చర్చలు జరిగాయన్నది తెలియరాలేదు. ఈ సందర్భంగా సంజ‌య్‌తో స‌మావేశాన్ని నితిన్ గ‌డ్క‌రీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

కాగా సంజ‌య్ ద‌త్ గతేడాది క్యాన్సర్ గుర‌య్యారు. లండన్‌కు వెళ్లి శస్త్ర చికిత్స చేయించుకున్న సంజయ్‌ దత్‌ క్యాన్సర్‌ నుంచి కోలుకున్న‌ట్లు అక్టోబరులో ప్ర‌క‌టించారు.ఇక  సంజయ్ దత్ న‌టించిన కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ విడుదలకు సిద్ధమౌతుంది. ఈ చిత్రంలో సంజ‌య్ నెగటివ్ రోల్‌లో కనిపించనున్నాడు. బ్లాక్ బస్టర్ ''కేజీఎఫ్ చాప్టర్ 1'' కు సీక్వెల్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. అదే విధంగా “పృథ్వీరాజ్”, “భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా” లలో కూడా సంజ‌య్‌ కనిపించనున్నాడు. 

మరిన్ని వార్తలు