నటి తునీషా ఆత్మహత్య వెనక లవ్‌ జిహాద్‌ కోణం ఉందా?: బీజేపీ ఎమ్మెల్యే

25 Dec, 2022 15:11 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ యువనటి తునీషా శర్మ  ఆత్మహత్య కేసుపై  కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్‌. తునీషా ఆత్మహత్య వెనుక ‘లవ్‌ జిహాద్‌’ కోణం దాగి ఉందని ఆరోపించారు.  ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తామని, నేరస్థులు తప్పించుకోలేరని తెలిపారు. తునీషా కుటుంబానికి న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. 

‘ఆత్మహత్యకు గల కారణాలేంటి? ఇందులో లవ్‌ జిహాద్‌ కోణం ఉందా?లేదా మరో అంశం దాగుందా? దర్యాప్తులో నిజాలు బయటకు వస్తాయి. కానీ, తునీషా శర్మ కుటుంబానికి 100 శాతం న్యాయం జరుగుతుంది. ఒకవేళ ఇందులో లవ్‌ జిహాద్‌ కోణం దాగిఉంటే.. దాని వెనక ఏ సంస్థ ఉంది, నేరస్థులేవరు అనే విషయంపై పోలీసులు విచారణ చేస్తారు.’

- రామ్‌ కదమ్‌, బీజేపీ ఎమ్మెల్యే.

బాలీవుడ్‌ యువనటి తునీషా శర్మ శనివారం రోజున మహారాష్ట్ర పాల్ఘర్‌ జిల్లోని వాసాయ్‌లో ఓ టీవీ షో సెట్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో ఆత్మహత్యకు ప్రేరేపించాడనే ఆరోపణలతో ఆమె సహ నటుడు షీజన్‌ మొహమ్మెద్‌ ఖాన్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్‌ చేశారు. తునిషా తండ్రి ఫిర్యాదు మేరకు అతడిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. వారు ఇరువురు రిలేషన్‌లో ఉన్నారని, 15 రోజుల క్రితమే విడిపోయినట్లు తెలిసిందన్నారు. ఈ కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు.  నాలుగు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ వాసాయ్‌ కోర్టు ఆదివారం ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి:  Tunisha Sharma Suicde Case: సీరియల్‌ నటి ఆత్మహత్య కేసులో సహనటుడు అరెస్ట్‌

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు