బిహార్‌ పోలీసుల దర్యాప్తుపై రియా లాయర్‌ ఫైర్‌

18 Aug, 2020 15:02 IST|Sakshi

రాజకీయ జోక్యంపై ఆందోళన

ముంబై : బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో ఆదిత్యా ఠాక్రేపై ఆరోపణల నేపథ్యంలో రియా చక్రవర్తి శివసేన నేతను ఎన్నడూ కలుసుకోలేదని ఆమె న్యాయవాది సతీష్‌ మనేషిండే పేర్కొన్నారు. ఆదిత్యా ఠాక్రేతో రియాకు పరిచయం లేదని చెప్పుకొచ్చారు. జూన్‌ 8నే సుశాంత్‌ నివాసం నుంచి రియా బయటకు వచ్చారని తెలిపారు. ఇక సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు బిహార్‌ పోలీసుల పరిధిలో లేనుందున వారి దర్యాప్తునకు రియా చక్రవర్తి స్పందించాల్సిన అవసరం లేదని ఆమె న్యాయవాది మంగళవారం స్ప్షష్టం చేశారు. చట్ట ప్రకారం బిహార్‌ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తును ముంబై పోలీసులకు బదలాయించాలని, ఈ కేసు పరిధి బిహార్‌ పోలీసుల పరిమితిలో లేదని పేర్కొన్నారు.

సుశాంత్‌ మృతిపై 40 రోజులు తాత్సారం బిహార్‌ పోలీసులు తాత్సారం చేసినా ఫిర్యాదు వచ్చిన రోజే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని రియా చక్రవర్తి న్యాయవాది పేర్కొన్నారు. తమ విచారణకు సహకరించాలని రియాను కోరకుండానే బిహార్‌ పోలీసులు ముంబై చేరుకున్నారని చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు బిహార్‌ పోలీసులు వెనుకాడారని, రాజకీయ నేతల ప్రోద్బలంతోనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని ఫిర్యాదుదారు న్యాయవాది చెప్పారని పలు పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన ఉటంకించారు. తన క్లయింట్‌ ఏ దర్యాప్తు సంస్థకైనా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని, ఈ కేసును విచారించే పరిధి కలిగి నిష్పాక్షిక విచారణ జరిపితే సహకరించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. బిహార్‌లో దర్యాప్తు జరుగుతున్న తీరు అందుకు భిన్నంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ కేసులో రాజకీయ నేతల జోక్యం అధికమైందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా జూన్‌ 14న సుశాంత్‌ ముంబైలోని బాంద్రా నివాసంలో బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. చదవండి : మూవీ మాఫియాపై కంగనా ఫైర్‌

మరిన్ని వార్తలు