కశ్యప్‌పై పాయల్‌ లైంగిక దాడి ఆరోపణలు

20 Sep, 2020 05:21 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ చిత్ర నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌ తనపై లైంగిక దాడి చేశారంటూ నటి పాయల్‌ ఘోష్‌ ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ ప్రధాని మోదీని కోరారు. శనివారం ఆమె ట్విట్టర్‌లో..‘అనురాగ్‌ కశ్యప్‌ నాపై చాలా తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడు. నరేంద్ర మోదీజీ.. ఈ విషయంలో చర్య తీసుకోండి. కశ్యప్‌లోని రాక్షస కోణాన్ని ప్రజలకు చూపెట్టండి. ఇలా వెల్లడించడం నాకు హాని చేస్తుందని, నా భద్రతకు ముప్పు అని నాకు తెలుసు. సాయం చేయండి’ అని కోరారు.

దీనిపై జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ స్పందించారు. పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తే తాము చర్య తీసుకుంటామని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పటేల్‌కి పంజాబీ బీబీ అనే సినిమాలో, నిభానా సాథియా అనే టీవీ కార్యక్రమంలో పాయల్‌ ఉన్నారు. ఇప్పటికే నటి కంగనా రనౌత్, దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో పాయల్‌ ఘోష్‌ ఆరోపణలపై కంగనా మద్దతు తెలిపారు.

మరిన్ని వార్తలు