తుది‘దశ’లో ఆదిత్య ఎల్‌1

26 Nov, 2023 06:28 IST|Sakshi

తిరువనంతపురం: సూర్యుడి సంబంధ అంశాలపై మరింత లోతైన అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్‌–1 వ్యోమనౌక త్వరలోనే దాని ఎల్‌–1 పాయింట్‌లోకి చేరుకోనుందని ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ వెల్లడించారు.

తొలి సౌండింగ్‌ రాకెట్‌ను ప్రయోగించి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌(వీఎస్‌ఎస్‌సీ)లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సోమనాథ్‌ మాట్లాడారు. ‘ ఆదిత్య తన దిశలో దూసుకుపోతోంది. ఇది దాదాపు తన తుదిదశకు చేరుకుంది. ఎల్‌–1 పాయింట్‌లోకి దానిని చేర్చేందుకు సన్నాహక కార్యక్రమాలు చేపడుతున్నాం. వచ్చే ఏడాది జనవరి ఏడో తేదీకల్లా ఎల్‌–1లోకి ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధంచేశాం’’ అని చెప్పారు. 

మరిన్ని వార్తలు